పల్లికాయల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ : పాకిస్థానీ తెలివితేటలు

పల్లికాయల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ : పాకిస్థానీ తెలివితేటలు

బంగారం, డ్రగ్స్, విలువైన వస్తువులు, జంతు చర్మాలు.. ఇలా.. చట్టవిరుద్ధంగా దేన్ని కూడా సరిహద్దులు దాటించొద్దు. అందుకే.. అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో విమాన ప్రయాణికులను పూర్తిగా తనిఖీ చేస్తుంటారు కస్టమ్స్ అధికారులు. ఐనా… జరిగే స్మగ్లింగ్ జరుగుతూనే ఉంటుంది. దేశంలో రకరకాలుగా స్మగ్లింగ్ జరుగుతున్న తీరు… ఇప్పటికే చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇపుడు పాకిస్థాన్ లో ఓ వ్యక్తి వెరైటీగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి కస్టమ్స్ సిబ్బందికి దొరికిపోయాడు. ఓ వ్యక్తి క్యారీ చేస్తున్న బ్యాగ్ ను అధికారుల ఓపెన్ చేయించి చూశారు. లోపల కవర్ లో పల్లికాయలు ఉన్నాయి. తాను వెళ్తున్న ఏరియాలో పల్లీలు దొరకడం లేదు.. తినడానికి తీసుకెళ్తున్నానని సదరు వ్యక్తి చెప్పాడు. డౌట్ వచ్చిన అధికారులు వాటిని ఓపెన్ చేసి చూసి షాకయ్యారు.

పల్లికాయల్లో డ్రగ్స్, మత్తు పదార్థాలను ఇరికించి దొంగతనంగా తీసుకెళ్తున్నాడు ఆ వ్యక్తి. పల్లికాయలను ఒలిచి.. అందులో గింజలు తీసేసి… వాటి స్థానంలో  డ్రగ్స్ నింపి… తిరిగి ఎప్పటిలాగే అంటించి బ్యాగ్ లో పెట్టాడు ఆ స్మగ్లర్.

ఈ సంఘటన తర్వాత… స్మగ్లింగ్ తనిఖీల్లో తాము మరింతగా అలర్ట్ గా ఉండాల్సిన అసరముందని పాకిస్థాన్ ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు. స్మగ్లర్లు తనిఖీలకు దొరక్కుండా కొత్తకొత్తగా ఆలోచిస్తున్నారని… ఏ వస్తువును చూసినా నమ్మదగ్గ పరిస్థితులు లేవని ఎయిర్ పోర్టు తనిఖీ అధికారులు అంటున్నారు.