
హైదరాబాద్ బీజేపీ కార్యాలయం ఎదుట విషాదం చోటు చేసుకుంది. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన బీజేపీ కార్యకర్త ఒంటిమీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ బండిసంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. 40శాతం శరీరం కాలిన గాయాలతో ఆహాకారాలు చేస్తూ బండిసంజయ్ అంటే నాకు ప్రాణం. ఆయనకోసం నా గుండె కోసిస్తా. పార్టీకోసం నా ప్రాణం త్యాగం చేస్తానన్నాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు శ్రీనివాస్ పై నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా కార్యకర్త ఆత్మహత్యాయత్నం పై సమాచారం అందుకున్న బండి సంజయ్ హుటాహుటీన దుబ్బాక నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.