కరోనాతో చనిపోయాడన్న వ్యక్తి.. రెండేండ్లకు తిరిగొచ్చిండు

కరోనాతో చనిపోయాడన్న వ్యక్తి.. రెండేండ్లకు తిరిగొచ్చిండు

ధార్ (మధ్యప్రదేశ్) : కరోనా సెకండ్ వేవ్ టైంలో ఓ వ్యక్తి వైరస్ బారిన పడి చనిపోయాడు. డెడ్​బాడీని అతని కుటుంబ సభ్యులకు అప్పగించగా.. వారు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఆ వ్యక్తి మళ్లీ రెండేండ్ల తర్వాత శనివారం పొద్దున ఆరు గంటలకు ఇంటికొచ్చేశాడు. అతన్ని చూసిన ఫ్యామిలీ మెంబర్స్ షాక్​కు గురయ్యారు. ‘‘2021లో కమలేశ్‌‌ పాటిదార్ (35) కరోనా బారినపడ్డాడు. హెల్త్ కండీషన్ క్రిటికల్​గా ఉండటంతో గుజరాత్‌‌ వడోదరలోని ఓ హాస్పిటల్​లో అడ్మిట్ చేశాం. కమలేశ్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. డెడ్​బాడీని అప్పగించడంతో అంత్యక్రియలు కూడా పూర్తి చేశాం”అని కమలేశ్ కజిన్ ముఖేశ్ పాటిదార్ తెలిపాడు. దాదాపు రెండేండ్ల తర్వాత శనివారం పొద్దున ఆరు గంటలకు కరోడ్కల గ్రామంలో ఉన్న అతని చిన్నమ్మ ఇంటి తలుపు తట్టాడని వివరించాడు. 

కమలేశ్​ను చూసి ఇంట్లో ఉన్నవాళ్లందరూ షాక్​కు గురయ్యారని తెలిపాడు. రెండేండ్లు ఎక్కడ ఉన్నాడో మాత్రం చెప్పలేదన్నాడు. దీంతో జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించినట్లు తెలిపాడు. 2021లో కమలేశ్ చనిపోయాడని చెప్పి డాక్టర్లు డెడ్​బాడీని కుటుంబ సభ్యులకు ఇచ్చారని కన్వాన్ పోలీస్ స్టేషన్ ఇన్​చార్జ్​రామ్​సింగ్ రాథోడ్ తెలిపాడు. రెండేండ్లు ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కమలేశ్ ఫ్యామిలీ మెంబర్స్ అంత్యక్రియలు నిర్వహించిన డెడ్​బాడీ ఎవరిదనే విషయంపై కూడా విచారణ  జరుపుతున్నామని వివరించారు.