
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పిలుపునిచ్చారు. మన మునుగోడు.. మన కాంగ్రెస్ నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లి విజయం దిశగా ముందుకుసాగాలని అన్నారు. ఈ నెల 20న మునుగోడు నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదేశించారు. గాంధీ కుటుంబం త్యాగాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.
20వ తేదీన కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకం కావాలని మాణిక్కం ఠాగూర్ చెప్పారు. సెప్టెంబర్ 7వ తేదీన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించారు. అక్టోబర్ చివరి వారంలో తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. రాబోయే వంద రోజులు చాలా కీలకమన్న ఠూగూర్.. ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పని చేయాలని సూచించారు.