చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ వెంకట్ ఈ సీన్స్‌ను చాలా స్టైలిష్‌గా రూపొందిస్తున్నాడని టీమ్ చెబుతోంది.
అలాగే ఈ కీలకమైన సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి.
