తంగలాన్.. విక్రమ్ డైలాగ్స్ స్టేట్మెంట్పై..క్లారిటీ ఇచ్చిన తన మేనేజర్

తంగలాన్.. విక్రమ్ డైలాగ్స్ స్టేట్మెంట్పై..క్లారిటీ ఇచ్చిన తన మేనేజర్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (ChiyaanVikram) హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో తంగలాన్‌ (Thangalaan) అనే సినిమా చేస్తున్నారు. పీరియాడికల్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. విక్రమ్కు ఇది 61వ మూవీ.

ఇక తంగలాన్‌ టీజర్ రిలీజ్ లో భాగంగా విక్రమ్ అండ్ టీం హైదరాబాద్ కి కూడా వచ్చి ఆడియెన్స్ అండ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. విక్రమ్ మాట్లాడుతూ తంగలాన్ మూవీలో నాకు డైలాగ్స్ ఉండవని..శివ పుత్రుడు తరహాలో నా క్యారెక్టర్ ఉంటుందని తెలిపాడు.

దీంతో తమిళ్, తెలుగు ఆడియన్స్ అండ్ చియాన్ ఫ్యాన్స్ లో తెగ టెన్షన్ మొదలైంది. అసలు విక్రమ్ క్యారెక్టర్ కు  డైలాగ్స్ లేకుండా సినిమా ఏంటనీ..ఒక అపరిచితుడు వంటి డైలాగ్స్ ఆశిస్తున్నాం అంటూ..సోషల్ మీడియాలో కామెంట్స్ తెలిపారు. ఇదే విషయంపై తంగలాన్‌ సినిమాలో విక్రమ్కు డైలాగ్ ఏమైనా ఉందా అని ఓ రిపోర్టర్ అడగ్గా.. విక్రమ్ మేనేజర్ సూర్య నారాయణ డైలాగ్స్ పై క్లారిటీ అందించారు.

ఈ తంగలాన్‌ ‘టీజర్ లో’ మాత్రమే తనకి డైలాగ్స్ లేవు అని హీరో విక్రమ్ అన్నారు.అంతేకానీ సినిమాలో కాదు. తాము ఈ చిత్రానికి లైవ్/సింక్ సౌండ్ వినియోగించడం కూడా జరిగిందని చెప్పారు. ఖచ్చితంగా తంగలాన్‌ మూవీలో విక్రమ్ గారికి డైలాగ్స్ ఉన్నాయని తన మేనేజర్ విక్రమ్ తరపున క్లారిటీ ఇవ్వడంతో..చియాన్ ఫాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మేనేజర్ సూర్యనారాయణ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక రీసెంట్గా..తంగలాన్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. విక్రమ్ లుక్స్, ఎదురుపడే శత్రు సైన్యంతో.. విక్రమ్ చేసే విరించిత పోరాట సన్నివేశాలతో టీజర్ అదిరిపోయింది. గిరిజన తెగలో ఆపద వస్తే..కరుడుగట్టిన నాయకత్వంతో ముందుకు కదిలిన విక్రమ్..తనదైన నటనతో టీజర్ హైలెట్గా నిలిచింది.

ALSO READ :- చరిత్ర సృష్టించిన నేపాల్‌ జట్టు.. 2024 టీ20 వరల్డ్ కప్‌ అర్హత

ఈ టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా..ఎమోషన్స్తో, పోరాట సన్నివేశాలతో సాగించాడు డైరెక్టర్ పా. రంజిత్. స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ (MalavikaMohanan)గా కనిపించనుంది.