
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీ కోసం అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సీసీఐ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు మే 24 ఆఖరు.
- పోస్టుల సంఖ్య: 147
- పోస్టులు: మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) 10, మేనేజ్మెంట్ ట్రైనీ(అకౌంట్స్) 40, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 125, జూనియర్ అసిస్టెంట్(కాటన్ టెస్టింగ్ ల్యాబ్) 02.
- ఎలిజిబిలిటీ: మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) పోస్టుకు ఎంబీఏ అగ్రి మేనేజ్మెంట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ(అకౌంట్స్) పోస్టుకు సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్(కాటన్ టెస్టింగ్ ల్యాబ్) పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇనుస్ట్రుమెంటేషన్ ట్రేడులో 50 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్ ప్రారంభం: మే 09.
- అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 24.
- అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.500.
- శాలరీ: మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) రూ.30,000–1,20,000(ఐడీఏ), మేనేజ్మెంట్ ట్రైనీ(అకౌంట్స్) రూ. 30,000– 1,20,000(ఐడీఏ), జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ రూ.22,000–90,000, జూనియర్ అసిస్టెంట్(కాటన్ టెస్టింగ్ ల్యాబ్) 22,000–90,000.
సెలెక్షన్ ప్రాసెస్
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 120 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. పూర్తి వివరాలకు cotcorp.org.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.
►ALSO READ | ఐసీఎంఆర్ ఎన్సీడీఐఆర్లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు నోటిఫికేషన్