మనక్సియాకు రూ.200 కోట్ల విలువైన ఆర్డర్

మనక్సియాకు రూ.200 కోట్ల విలువైన ఆర్డర్

న్యూఢిల్లీ: యూరోపియన్​ క్లయింట్​నుంచి రూ.200 కోట్ల విలువైన ఆర్డర్​దక్కించుకున్నామని హైదరాబాద్​కు చెందిన  మనక్సియా కోటెడ్ మెటల్స్ అండ్​ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఎంసీఎంఐఎల్). ఈ ఒప్పందం ప్రకారం సంస్థ  రాబోయే 12 నెలల్లో 20 వేల మెట్రిక్ టన్నుల ప్రీమియం ప్రీ-పెయింటెడ్ స్టీల్ కాయిల్స్, అలు జింక్ కోటెడ్ స్టీల్ కాయిల్స్, గాల్వనైజ్డ్ స్టీల్ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. 

దీనివల్ల తమ ఎగుమతి ఆదాయం భారీగా పెరుగుతుందని తెలిపింది.  ఈ ఒప్పందం భారతీయ తయారీదారులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలరని, గ్లోబల్ మార్కెట్ల డిమాండ్లను తీర్చగలరని నిరూపిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు తయారీ పరిశ్రమలో ఉద్యోగాలను పెంచుతుందని పేర్కొంది. 

ALSO READ | అక్టోబర్ 14 న హ్యుందాయ్ ఐపీఓ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!