- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: వైద్య వృత్తి సవాళ్లతో కూడుకుందని, ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలకు కొంత సమయం కేటాయించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం హాజీపూర్ లోని మెడికల్ కాలేజీలో డీవైఎస్వో హనుమంత్‌రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ సులేమాన్ తో కలిసి మెడికోలకు క్రీడా సామాగ్రి అందించారు. అనంతరం మాతృత్వ దినోత్సవం సందర్భంగా మాత శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డీఎంహెచ్‌వో అనిత, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, తదితరులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలను నియంత్రించాలి
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కలెక్టరేట్ లో డీసీపీ ఎ.భాస్కర్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరావు, డీఏవో సురేఖ, మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఎసీపీలు ప్రకాశ్, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లుతో కలిసి నకిలీ పత్తి విత్తనాల నియంత్రణపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ పత్తి విత్తనాలను సప్లై చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
