విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..  విధులకు హాజరు కాని ఆరుగురికి కలెక్టర్షోకాజ్ నోటీసులు

విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..  విధులకు హాజరు కాని ఆరుగురికి కలెక్టర్షోకాజ్ నోటీసులు

కోల్​బెల్ట్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం మందమర్రిలోని కేజీబీవీని సందర్శించి అదనపు క్లాస్​రూమ్​లు, మెస్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు స్పీడప్​చేసి త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం ఆదర్శ పాఠశాల, జూనియర్ కాలేజీని సందర్శించి విద్యార్థుల సంఖ్య, కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. సమయ పాలన పాటించకుండా విధులకు హాజరుకాని ఆఫీస్​లోని ఆరుగురు సిబ్బందికి షోకాజ్​నోటీసులు జారీ చేయాలని తహసీల్దార్​ సతీశ్​ను ఆదేశించారు.