మంచిర్యాల, వెలుగు: 2026–27 ఆర్థిక సంవత్సరానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ రూ.74.76 కోట్లతో ఆమోదించారు. లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ డి.చంద్రయ్య ఆధ్వర్యంలో శనివారం బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు. సాధారణ ఆదాయం రూ.50.37 కోట్లు, క్యాపిటల్ ఇన్కమ్ గ్రాంట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్ లు రూ.24.38 కోట్లు కలిపి మొత్తం రూ.74.76 కోట్లతో బడ్జెట్ ను ఆమోదించారు.
మిగులు బడ్జెట్ కింద రూ.8.89 కోట్లు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ను 54 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించగా.. ముగ్గురు బీజేపీ, మరో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యతిరేకించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల డివిజన్లకు ఎక్కువ నిధులు కేటాయిస్తూ తమ డివిజన్లకు అన్యాయం చేస్తున్నారని మూతికి గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. మేయర్ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్సల్ల రమ్య, కమిషనర్అన్వేశ్పాల్గొన్నారు.
