- మంచిర్యాల జిల్లాలో ఎస్సీ 81, ఎస్టీ 65, బీసీ 23 స్థానాలు
- 50 శాతం మించకుండా రిజర్వేషన్లు
- మిగతా స్థానాలు జనరల్కేటగిరీలోకి..
- మహిళలకు 50 శాతం వాటా
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం బీసీ డెడికేటెడ్కమిషన్ రికమండేషన్స్ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించారు. శనివారం మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ వివిధ రాజకీయ ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిలో రిజర్వేషన్లు ఫైనల్ చేశారు.
మొత్తం జీపీల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు. మిగతా స్థానాలను జనరల్ కేటగిరీగా పరిగణిస్తారు. పాత పద్ధతి ప్రకారం స్థానిక సంస్థల్లో మహిళలకు 50 పర్సెంట్కేటాయించారు. ఈ సీట్లలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాటా దక్కనుంది. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది.
ఎస్సీ, ఎస్టీలకే పెద్దపీట
జిల్లాలో మొత్తం 306 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 2011 సెన్సెస్ ప్రకారం, బీసీలకు 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, సమగ్ర కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని బీసీ డెడికేడెట్ కమిషన్రికమండ్ చేసింది.
కానీ రిజర్వేషన్లపై 50 పర్సెంట్సీలింగ్ఉండడంతో బీసీలకు ఆశించిన స్థానాలు దక్కలేదు. పాత పద్ధతిలోనే నాన్ షెడ్యూల్డ్, షెడ్యూల్డ్ఏరియాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ సీట్లు వచ్చాయి. షెడ్యూల్డ్ ఏరియాలో మొత్తం 267 పంచాయతీలకు గాను ఎస్సీలకు 81, ఎస్టీలకు 26, బీసీ 23 సీట్లు కేటాయించారు. షెడ్యూల్డ్ ఏరియాలోని 39 పంచాయతీలు ఎస్టీ ఖాతాలోకి వెళ్లాయి. ఈ లెక్కన ఎస్టీ స్థానాల సంఖ్య 65కు చేరింది.
పార్టీ పరంగా బీసీలకు 42 శాతం
బీసీలకు జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. కానీ అది అమల్లోకి రాకపోవడంతో బీసీలకు ఇచ్చిన హామీ మేరకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు ఊరట లభించినట్లయ్యింది. అయితే మిగతా రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తాయో లేదో ఇంతవరకు స్పష్టత రాలేదు. సర్పంచ్ఎన్నికలు పార్టీలకు అతీతం అయినప్పటికీ ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులే పోటీలో ఉండడం తెలిసిందే.
షెడ్యూల్డ్ ఏరియాలోని ఎస్టీ స్థానాలు
బెల్లంపల్లి 01
దండేపల్లి 09
హాజీపూర్ 04
జన్నారం 03
కాసిపేట 15
లక్సెట్టిపేట 02
తాండూర్ 02
జన్నారం 03
మొత్తం 39
నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో మండలాల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు
మండలం జీపీలు ఎస్సీ ఎస్టీ బీసీ
బెల్లంపల్లి 16 05 01 02
భీమారం 11 03 02 00
భీమిని 12 03 01 02
చెన్నూర్ 30 11 02 02
దండెల్లి 22 05 02 04
హాజీపూర్ 08 03 00 01
జైపూర్ 20 08 01 01
జన్నారం 23 06 03 02
కన్నెపల్లి 15 04 01 02
కాసిపేట 07 01 02 00
కోటపల్లి 31 12 03 00
లక్సెట్టిపేట 16 04 00 04
మందమర్రి 10 03 02 00
నెన్నెల 19 06 03 00
తాండూర్ 13 03 01 02
వేమనపల్లి 14 04 02 01
మొత్తం 267 81 26 23
