
జైపూర్(భీమారం), వెలుగు: పద్మశాలీలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాపు అన్నారు. ఆదివారం భీమారం మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో పద్మశాలీ సంఘాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుడిమల్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల నరేశ్, కోశాధికారిగా నరహరి, గౌరవ అధ్యక్షుడిగా బండి రాజం, ఉపాధ్యక్షులుగా బండి శ్రీరాములు, సిరిపురం మధుకర్‌ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా బాపు మాట్లాడుతూ.. పద్మశాలీలు వృత్తిపరంగా, విద్యా రంగంలో, వ్యాపారాల్లో స్ఫూర్తిదాయకంగా ఉన్నా.. రాజకీయ ప్రాతినిధ్యం లోపించిందన్నారు. ఫలితంగా పద్మశాలి సమాజానికి అన్యాయం జరుగుతోందన్నారు. ఇకనైనా చైతన్యవంతులై స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావాలని పద్మశాలీలకు పిలుపునిచ్చారు. కార్య క్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దేవసాని నాగరాజు, సంఘం సభ్యులు గుడిమల్ల శ్రీనివాస్, వేణుగోపాల్, అరుణ్ కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.