కొనసాగుతున్న కాకా క్రికెట్​ టోర్నమెంట్

కొనసాగుతున్న కాకా క్రికెట్​ టోర్నమెంట్

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో ‘కాకా వెంకటస్వామి కప్’ పేరిట నిర్వహిస్తున్న క్రికెట్​టోర్నమెంట్ సందడిగా సాగుతోంది. బుధవారం ఉదయం బెల్లంపల్లిలోని ఏఎంసీ-–2 గ్రౌండ్ లో జరిగిన ఫస్ట్​మ్యాచ్​లో భీమిని, కాసీపేట జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్​చేసిన భీమిని టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన కాసీపేట టీమ్​రెండు వికెట్లు కోల్పోయి కేవలం 6.4 ఓవర్లలోనే టార్గెట్​ను చేజ్​చేసింది.

కాసీపేటకు చెందిన రొడ్డ రేవంత్ 2 వికెట్లు తీయడంతోపాటు, 19 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. ఎ.తిరుపతి 38 పరుగులు చేశాడు. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్​లో నెన్నెల, కన్నెపల్లి జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్​చేసిన నెన్నెల టీమ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. పల్తాయ రాకేశ్ 43, శివ 20, చందు 19 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన కన్నెపల్లి టీమ్ 14.1 ఓవర్లలో 43 పరుగులకే ఆలౌట్ అయింది. కార్తీక్​అనే బ్యాటర్​21 పరుగులు చేశాడు. నెన్నెల టీంకు చెందిన పల్తాయ రాకేశ్​ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.

రామకృష్ణాపూర్ సింగరేణి స్టేడియంలో..

క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్​స్టేడియంలో బుధవారం భీమారం, రామకృష్ణాపూర్​రూరల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​టై అయింది. భీమారం టీమ్​7 వికెట్లు, ఆర్కేపీ రూరల్ టీమ్​8 వికెట్లు కోల్పోయి 141 పరుగులు సాధించడంతో నిర్వాహకులు డ్రాగా ప్రకటించారు. 66 పరుగులు చేసిన భీమారం ప్లేయర్ రంజిత్ మ్యాన్​ఆఫ్​ది మ్యాచ్​గా నిలిచాడు. కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్​పల్లె రాజు, లీడర్లు గోపతి రాజయ్య, నీలం శ్రీనివాస్​గౌడ్, బత్తుల వేణు, సురేశ్ మెమోంటో అందజేశారు.