
మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు సిల్వర్ స్ర్కీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో ఆయన కొడుకు అవ్రామ్ నటిస్తున్నాడు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
చిన్నప్పటి తిన్నడు పాత్రలో అవ్రామ్ కనిపించనున్నాడు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది.