ఎన్టీఆర్ సినిమాలో మంచు లక్ష్మీ.. దేవర కోసం కొరటాల షాకింగ్ డెసిషన్

ఎన్టీఆర్ సినిమాలో మంచు లక్ష్మీ.. దేవర కోసం కొరటాల షాకింగ్ డెసిషన్

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్(RRR) లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తాన్నాడు కొరటాల. 

అంతేకాదు.. దేవర నటీనటుల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం బాలీవుడ్ నుండి జాన్వీ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్ ను తీసుకున్న కొరటాల.. మరో కీ రోల్ కోసం మరో ప్రత్యేకమైన యాక్టర్ ను తీసుకున్నాడట దర్శకుడు. ఆ యాక్టర్ మరెవరో కాదు మంచు లక్ష్మి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్ర చాలా కీలకం కానుందట. ఆ పాత్ర కోసం మంచు లక్ష్మి అయితేనే బాగుటుందని భావించాడట కొరటాల. అందుకే మంచు లక్ష్మిని తీసుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. చాలా ఎమోషనల్ గా సాగే ఈ పాత్రలో మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా కనిపించనున్నారట మంచు లక్ష్మి. ఈ పాత్రలో ఆమె నటన చాలా అద్భుతంగా, గుర్తుండిపోయేలా ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికి రూమర్ గా ఉన్న ఈ న్యూస్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.