Manchu Manoj: మా నాన్నే నాకు హీరో.. బర్త్ డే స్పెషల్గా మంచు మనోజ్ ఎమోషనల్

Manchu Manoj: మా నాన్నే నాకు హీరో..  బర్త్ డే స్పెషల్గా మంచు మనోజ్ ఎమోషనల్

తొమ్మిదేళ్ల తర్వాత ‘భైరవం’చిత్రంతో  తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడం వెరీ ఎమోషనల్ మూమెంట్ అని మంచు మనోజ్ చెప్పాడు. తనతో పాటు  బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధా మోహన్ నిర్మించారు. మే 30న సినిమా విడుదల  కానుంది.

అలాగే మంగళవారం (MAY20) తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ చెప్పిన ఆసక్తికరమైన విశేషాలు. ‘‘ఇదొక మంచి యాక్షన్ డ్రామా. ఇందులో ప్రతి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరి స్క్రీన్ స్పేస్ వారిదే. ప్రతి ఒక్కరూ ఫెంటాస్టిక్‌‌‌‌‌‌‌‌గా పెర్ఫార్మ్ చేశారు. నేను గజపతి వర్మ పాత్రలో కనిపిస్తా. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు. చాలా ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ఈ చిత్రం నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పెషల్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తుందని భావిస్తున్నా.

ఇందులో నటించిన సాయి నాకు తమ్ముడు లాంటివాడు. రోహిత్ నాకు మంచి ఫ్రెండ్.  కాబట్టి మా మధ్య బాండింగ్ మరింత పెరిగింది. నా పర్సనల్ లైఫ్‌‌‌‌‌‌‌‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా షూటింగ్‌‌‌‌‌‌‌‌కి ఇబ్బంది కలగకుండా జెట్ స్పీడ్‌‌‌‌‌‌‌‌లో చేసుకుంటూ వెళ్లాం. డైరెక్టర్ విజయ్  అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమాని ప్రజెంట్ చేశారు.

తమిళ మాతృక ‘గరుడన్’చూసిన వాళ్లు కూడా ఈ చిత్రం చూసి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అవుతారు. దానికితగ్గట్టు శ్రీ చరణ్ పాకాల బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. ఇప్పటివరకు వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్‌‌‌‌‌‌‌‌గా నిలిచాయి. రాధా మోహన్ గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. కథను నమ్మి ఎక్కడా రాజీ పడకుండా చేశారు.

ఇక నేను ‘అహం బ్రహ్మాస్మి’చిత్రంతో సోలోగా వద్దామనుకున్నా. అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయితే  దేవుడు ఇలా ప్లాన్ చేశాడు. భైరవం, మిరాయి ఇవన్నీ కూడా దేవుడు ప్లాన్ చేసిన సినిమాలే అనుకుంటున్నా. 

ఈ బర్త్ డే నుంచి నాకు ఒక కొత్త జన్మ మొదలు కాబోతోంది. ఏ స్టేజ్ అయితే మిస్ అయ్యానో దేవుడు మళ్లీ ఇచ్చాడు. మాక్సిమమ్ టైం మూవీస్ చేయాలని భావిస్తున్నా. నేను బిగినింగ్ నుంచి చాలా ప్రయోగాత్మక సినిమాలు చేశా. సినిమా సినిమాకి కంప్లీట్ డిఫరెంట్ ఉండేలా చూసుకున్నా. భవిష్యత్తులోనూ కొత్త రకం సినిమాలు చేయాలని ఉంది. అలాగే పిల్లల కోసం ఒక సినిమా చేయాలనుంది. 
    
నమ్మినోల్ని బాగా చూసుకోవడం, పదిమందికీ హెల్ప్ చేయడం నాన్న గారిని చూసి నేర్చుకున్నా. ఆయన కష్టపడుతూ పైకి వచ్చారు. ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నిజాయితీగా ఉండడం ఆయన దగ్గరే చూసి నేర్చుకున్నాను. నాకు మా ఫాదరే హీరో.