
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా లీడ్ రోల్స్‌లో తోట శ్రీకాంత్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘థాంక్యూ డియర్’. పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. ఇందులోని ‘చిక్కక చిక్కిన గుమ్మ’ అనే పల్లవితో సాగే ఈ పాటను మంచు మనోజ్ లాంచ్ చేశాడు. సుభాష్ ఆనంద్ కంపోజ్ చేసిన ఈ పాటను శ్రీచరణ్ పాడగా, నిర్మాత బాలాజీ రెడ్డి లిరిక్స్ రాశారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ ‘తమ్ముడు ధనుష్ రఘుముద్రికి ఆల్ ది బెస్ట్. నాన్నగారి దగ్గర నుండి వాళ్ల కుటుంబం మాకెంతో సన్నిహితులు. సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని విషెస్ చెప్పాడు. టీమ్ అంతా పాల్గొన్నారు. వీర శంకర్, నాగ
మహేష్, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత , శ్రీనివాస్ నాయుడు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.