
భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. స్టేజిపై మంచు మనోజ్ కన్నీరు పెట్టుకున్న వీడియోస్, టోటల్ స్పీచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఈవెంట్లో మనోజ్ తన అన్న విష్ణుపై ఇన్ డైరెక్ట్ గా చేసిన కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి.
లాంచ్, రీ లాంచ్ అని చాలా ప్లాన్ చేశాను..మనం ఒకటి అనుకుంటే, దేవుడు ఇంకోటి తలుస్తాడు. ‘శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు. శివుడిని మనసారా తలుచుకుంటే.. మా డైరెక్టర్ రూపంలోనో.. ప్రొడ్యూజర్ రూపంలోనో.. మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు’అని మనోజ్ కన్నప్ప మూవీని ఉద్దేశిస్తూ..సెటైరికల్‍గా మాట్లాడారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. అయితే, మనోజ్ భైరవం మూవీతో రీ లాంచ్ అవుతున్నాడు. దాదాపు 9 ఏళ్ల తర్వాత భైరవం మూవీ చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు.
శివుడిని 'శివయ్య' అని పిలిస్తే రాడు....
— The Cine Gossips (@TheCineGossips) May 18, 2025
- #ManchuManoj satires on Manchu Vishnu and Moham Babu. pic.twitter.com/jtU0f9YU7g
ఇకపోతే, మంచు ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం రెండు సినిమాలు వస్తున్నాయి. మంచు ఫ్యాన్స్తో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విష్ణు నటించిన కన్నప్ప మూవీ జూన్ 27న విడుదల కానుంది. మే 30న భైరవం థియేటర్లలో గ్రాండ్గా విడుదలకు సిద్ధం అయింది.
భైరవం విషయానికి వస్తే.. తమిళ హిట్ ‘గరుడన్’ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా, ముగ్గురు మిత్రుల కథతో, దేవాలయం నేపథ్యంగా సాగుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌లో నటించారు. మే19న రిలీజైన ట్రైలర్ అంచనాలు మించి ఉంది.
►ALSO READ | Manoj Manchu: స్టేజిపై ఏడ్చేసిన మంచు మనోజ్.. కట్టుబట్టలతో రోడ్డుపై పెట్టేశారు.. కార్లు లాగేసుకున్నారు
కృష్ణుడు గీతలో చెప్పిన వాక్యంతో ప్రారంభమైన ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంటూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. గ్రామస్తులు పవిత్రంగా భావించే వారాహి ఆలయ భూములను మంత్రి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ముగ్గురు స్నేహితులు కలిసి ఆలయాన్ని, దాని వారసత్వాన్ని రక్షించేందుకు బలంగా నిలబడతారు. సాయి శ్రీనివాస్, మనోజ్, నారా రోహిత్‌లు కంప్లీట్ యాక్షన్ లుక్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశారు.