డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంచు విష్ణు భేటీ

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంచు విష్ణు భేటీ

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)ను ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) కలిశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బట్టి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబందించిన పలు సమస్యల గురించి చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టిని సన్మానించారు మంచు విష్ణు. ఈభేటీలో మంచు విష్ణుతో పాటు నటులు రఘుబాబు, శివ బాలాజీ కూడా పాల్గొన్నారు. 

కాగా.. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి టాలీవుడ్ ప్రముఖులు వరుసగా భేటీలు అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే నేడు(ఫిబ్రవరి 4) మంచు విష్ణు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు.