మంచు విష్ణు మూవీకి టైటిల్ ఫిక్స్

మంచు విష్ణు మూవీకి టైటిల్ ఫిక్స్

మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పాయల్ రాజ్‌‌పుత్ హీరోయిన్. సన్నీలియోన్ కీలక పాత్ర పోషిస్తోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్‌‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కోన వెంకట్ కథ, స్ర్కీన్ ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి ‘జిన్నా’ అనే టైటిల్‌‌ పెట్టినట్టు నిన్న అనౌన్స్‌‌ చేశారు. తిరుపతి బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘గాలి నాగేశ్వరరావు’ అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు విష్ణు. అతనికి తన పేరు నచ్చక షార్ట్ కట్‌‌లో జిన్నాగా మార్చుకుంటాడు. అందుకే ఇదే పేరును టైటిల్‌‌గా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని ఓ స్పెషల్ వీడియో ద్వారా రివీల్ చేశారు. ఇందులో రైటర్ కోన వెంకట్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్,  డైరెక్టర్ ఈషాన్ కలిసి టైటిల్‌‌ ఫైనల్ చేయడాన్ని ఓ చిట్‌‌చాట్‌‌లా చూపించారు.