Manchu vishnu: కూతుర్లు చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న విష్ణు

Manchu vishnu: కూతుర్లు చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న విష్ణు

మంచు విష్ణు తాజా తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కుమార్తెలు అరియానా, వివియానా చేసిన ఓ పనికి తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. వాళ్లు ఇచ్చిన సర్ ప్రైజ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. మంచు విష్ణు, ఆయన సతీమణి విరానికా బుధవారం 15వ పెళ్లి రోజు వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన ఇద్దరు కూతుళ్లు కలిసి ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. విష్ణు, విరానికాకు సంబంధించిన మోస్ట్‌ స్పెషల్‌ మూమెంట్స్‌ అన్నింటినీ కలిపి ఓ వీడియో రూపంలో తయరుచేశారు.

విష్ణు, విరానికాల పెళ్లి రోజు సందర్భంగా ‘మై ఫాదర్‌ లవ్స్‌ మై మామ్‌’ అంటూ ఓ సాంగ్ ను పాడి వీడియో చేసి సర్ ఫ్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను విష్ణు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ఈ సాంగ్‌ పూర్తయ్యే సమయానికి తన కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు. థ్యాంక్యూ డార్లింగ్స్‌. మీరిచ్చిన ఈ సర్‌ప్రైజ్‌ను ఎప్పటికీ మర్చిపోను అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.