కన్నప్ప మైథలాజీ మూవీ కాదు.. ట్విస్ట్ ఇచ్చిన మంచు విష్ణు

కన్నప్ప మైథలాజీ మూవీ కాదు.. ట్విస్ట్ ఇచ్చిన మంచు విష్ణు

టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa). మహాశివుని భక్తుడు కన్నప్ప కథతో వస్తున్న ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు మేకర్స్. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక్కడ మరో వేషం ఏంటంటే.. ఈ సినిమాలో మహాశివుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నారని సమాచారం. దీంతో కన్నప్ప సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అంతేకాదు.. మంచు ఫ్యామిలీ నుండి వస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, లేడీ సూపర్ స్టార్ నయనతార వంటి స్టార్స్ ను తీసుకున్నారు మేకర్స్. దీంతో కన్నప్ప సినిమాపై నేషనల్ వైడ్ బజ్ క్రియేట్ అవుతోంది.

నిజానికి కన్నప్ప అనేది హిందూ మైథాలజికి సంబందించిన పాత్ర. అందుకే అందరు ఈ సినిమాను ఒక మైథాలజీ మూవీగానే చూస్తున్నారు. కానీ, కన్నప్ప అనేది మైథాలజీ మూవీ కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు హీరో విష్ణు. ఇటీవలే సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించిన ఆయన ఈమేరకు కామెంట్స్ చేశారు. కన్నప్ప సినిమాను అందరూ మైథాలజీ మూవీ అనుకుంటున్నారు. కానీ కాదు. మైథాలజీ అంటే కల్పితమా అని అర్థం. కన్నప్ప కథ కల్పితం కాదు. నిజంగా జరిగిన కథ. అందుకే ఇది మైథాలజీ మూవీ కాదు. అంటూ కామెంట్స్ చేశారు విష్ణు.

ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థపై మంచు విష్ణు నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమాకు స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా  ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మరి మంచు ఫ్యామిలీలోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.