'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం

'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. తన ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ పై 400కి పైగా ఓట్ల భారీ మెజారిటీతో విష్ణు గెలుపొందారు. మంచు విష్ణు ప్యానెల్ కు ఇప్పటికే ట్రెజరర్, జనరల్ సెక్రటరీ పదవులు లభించాయి. ట్రెజరర్ గా శివబాలాజీ, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు విజయం సాధించారు.

అంతేకాదు.. ఈసీ మెంబర్లలోనూ విష్ణు ప్యానెల్ కు చెందిన 8 మంది విజయం సాధించారు. 'మా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన శ్రీకాంత్ విజయం సాధించారు. మరో వైస్ ప్రెసిడెంట్ గా విష్ణు ప్యానెల్ కు చెందిన మాదాల రవి గెలుపొందారు.