బీఎస్పీలోకి మంద జగన్నాథం

బీఎస్పీలోకి మంద జగన్నాథం
  •      నాగర్​కర్నూలు నుంచి పోటీ చేసే ఛాన్స్​

గద్వాల, వెలుగు: మాజీ ఎంపీ, కాంగ్రెస్​ నేత మంద జగన్నాథం బీఎస్పీలో చేరనున్నారు. పార్టీలో చేరేందుకు ఆయన మంగళవారం ఢిల్లీకి బయలుదేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు శ్రీనాథ్​కు అలంపూర్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించగా ఇవ్వలేదు. దీంతో అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించగా కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. దీంతో బీఎస్పీలో చేరేందుకు సిద్ధమైనట్టు ఆయన అనుచరులు చెప్పారు. జగన్నాథం నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశముంది.