
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు జరిగిన అవమానంపై నిరసన వ్యక్తం చేసేందుకు వేలాదిగా తరలిరావాలంటూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంబేద్కర్ వాదులకు పిలుపునిచ్చారు . కూల్చిన చోటే అంబేద్కర్ కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు.ఇందిరా పార్క్‌లో బుధవారం నిర్వహించ తలపెట్టినమహాగర్జన సభ ఏర్పాట్లను ఆయన మంగళవారంపరిశీలించారు . జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చేఅవకాశం ఉందని, ఇందిరా పార్క్దారి మొత్తాన్నిసభ కోసం కేటాయించాలని పోలీసులను కోరామన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున 15 ఏళ్లలోపు చిన్నారులను, వృద్ధులను సభకు తీసుకురావొద్దని మందకృష్ణ విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్జయంతికిసీఎం హోదాలో కేసీఆర్అంబేద్కర్విగ్రహానికి దండవేయలేదని, రాబోయే రోజుల్లోనైనా అంబేద్కర్నుగౌరవించాలని కోరారు. సభ పై గట్టి నిఘా పెట్టిన పోలీసులు.గతంలో మాదిరి విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం వుందని భావిస్తున్నారు.