ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇంకెప్పుడు తేలుస్తారు

ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇంకెప్పుడు తేలుస్తారు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో ఎస్పీ వర్గీకరణపై తమ నిరసనను తెలియజేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. జులై 2 న జరిగే సడక్ బంద్, 3 న చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ద్వంద వైఖరిని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శాంతియుతంగానే అయినా బలంగా తమ  వాదనను వినిపిస్తామన్నారు. బీజేపీ జాతీయ నాయకులతో పాటు తెలంగాణ, ఆంధ్ర బీజేపీ నాయకుల వల్లే ఎస్సీ వర్గకరణ అంశం ముందుకు సాగడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం తేల్చాలి లేదా మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు

అనేక సందర్భాలలో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన కేంద్ర పెద్దలు పార్లమెంట్ లో ఎందుకు బిల్లును పెట్టడంలేదని మందకృష్ణ ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతోనే హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు పెడుతున్నారని..అయితే హామినిచ్చిన ఎస్సీ వర్గీకరణ  విషయమే తేల్చలేదు.. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇంకేం చేస్తారని ఆయన నిలదీశారు. కేసులకు, జైల్ శిక్షలు తమకు కొత్తకాదని..దేనికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ అంశం పరిష్కారంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చొరవ తీసుకొవాలని కోరారు.