దళితుల ప్రాణాలకు మోడీ విలువ ఇవ్వడం లేదు

దళితుల ప్రాణాలకు మోడీ విలువ ఇవ్వడం లేదు

హైదరాబాద్, వెలుగు: రాజస్థాన్‌‌లోని ఓ స్కూల్ లో దళిత విద్యార్థిపై టీచర్ దాడి, హత్యను నిరసిస్తూ మంగళవారం అన్ని విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. కుల వివక్ష కారణంగా జరిగిన విద్యార్థి హత్యను ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఖండించకపోవడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ అన్నారు.

దళితుల ప్రాణాలకు మోడీ విలువ ఇవ్వడం లేదనడానికి ఇది నిదర్శనమని ఆరోపించారు. కులమంటే తెలియని పసి బాలుడిని వివక్షతో ఓ టీచర్ కొట్టిచంపడం మన దేశంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా జరగలేదని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆచరణలో వివక్ష కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విద్యా సంస్థల బంద్ కు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది, మేనేజ్ మెంట్లు సహకరించాలని కోరారు.