మహాగర్జనకు ప్రభుత్వ అభ్యంతరం దేనికి: మందకృష్ణ

మహాగర్జనకు ప్రభుత్వ అభ్యంతరం దేనికి: మందకృష్ణ

ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ”అంబేద్కర్‌ వాదుల మహాగర్జన” జరుపుతామన్నారు ఎమ్మార్పీస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్  పాల్గొనకపోవడంపై నిరసనగా ఏప్రిల్ 17న  మందకృష్ణ ధర్నా నిర్వహించాలనుకున్నారు. అందుకు రాష్ట్ర  ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అలాగే 22 వ తేదిన కూడా ధర్నా కోసం అనుమతి కోరితే మళ్లీ నిరాకరించింది.

దీంతో ఈ నెల 27 న నిర్వహించబోయే  ”అంబేద్కర్‌ వాదుల మహాగర్జన”  కు ప్రభుత్వ అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన రాష్ట్ర హైకోర్టును కోరారు.ఈ విషయంపై రేపు హైకోర్టు నిర్ణయం తమకు సానుకూలంగానే వస్తుందని మంద కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

తామేమీ ప్రగతిభవన్ ముందో లేదా అసెంబ్లీ ముందో అనుమతి కోరలేదని మంద కృష్ణ మాదిగ అన్నారు. ధర్నాలు, నిరసనలు చేపట్టడానికి హైకోర్టు నిర్ణయించిన ఇందిరా పార్కు వద్దే తమ నిరసన తెలపాలనుకున్నామని.. ఈ విషయంపై ప్రభుత్వం తన మొండి వైఖరి వీడాలని అన్నారు.

అంబేద్కర్ విగ్రహం పున: ప్రతిష్టాపన కోసం, అంబేద్కర్ ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని మందకృష్ణ అన్నారు.