గెలిచామన్న అహంకారం సీఎం కేసీఆర్ కు పనికిరాదు

గెలిచామన్న అహంకారం సీఎం కేసీఆర్ కు పనికిరాదు

మంచిర్యాల జిల్లా: సీఎం కేసీఆర్ బాధ్యరాహిత్యంగా వ్యవహరిస్తున్నాడన్నారు ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ. శుక్రవారం మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన మందకృష్ణ.. తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడిందన్నారు. ఆర్టీసీని కూడా ప్రమాదంలో పడేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని.. ఆర్టీసీ జోలికి వస్తే కేసీఆర్‌ను ప్రజలు సహించరన్నారు. రాష్ట్రంలో కోర్టులు, రాజ్యాంగం లేవన్నట్లుగా, ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు.

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో గెలిచామన్న అహంకారం సీఎం కేసీఆర్ కు పనికిరాదన్నారు మందకృష్ణ. జనరల్‌ ఎన్నికలలో గెలిచి చూపించాలని ఆయన సవాల్‌ విసిరారు. TRS గెలవడం కోసం వందల కోట్లు ఖర్చు చేసిందని మందకృష్ణ ఆరోపించారు. పోరాటాలు చేసైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని తెలిపారు మందకృష్ణ.