వివేక్ వెంకటస్వామిని విమర్శిస్తే సహించేది లేదు : పసుల రామ్మూర్తి

వివేక్ వెంకటస్వామిని విమర్శిస్తే సహించేది లేదు : పసుల రామ్మూర్తి

జమ్మికుంట, వెలుగు: మాలల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని విమర్శిస్తే సహించేది లేదని మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి హెచ్చరించారు. జమ్మికుంటలో సంఘం జాతీయ కార్యదర్శి మాదాసు మహేందర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీకి మందకృష్ణ మాదిగ మీద ప్రేమ ఉంటే బీజేపీకి అధ్యక్షునిగా నియమించుకోవాలన్నారు. గడ్డం వివేక్ వెంకటస్వామిపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని మందకృష్ణ మాదిగను హెచ్చరించారు. 

ఎస్సీ వర్గీకరణ మనువాదుల కుట్ర అని, దళితుల మధ్య చిచ్చు పెట్టి 30 ఏండ్లుగా అగ్రవర్ణ రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే మాలల సింహగర్జన సభకు ప్రతిగ్రామం నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేదరి నరేందర్, జిల్లా కార్యదర్శి చిరంజీవి, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మోహన్, నరసయ్య, చంద్రమౌళి, రాజు, కిశోర్, పవన్, విగ్నేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజేందర్, సంపత్, మహేందర్ 

పాల్గొన్నారు.