సింగరేణి ద్వారా నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ : జీఎం మనోహర్​ 

సింగరేణి ద్వారా నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ : జీఎం మనోహర్​ 
  •     మందమర్రి ఏరియా సింగరేణి జీఎం మనోహర్​ 
  •     మరో స్కిల్ ​డెవలప్​మెంట్ కోర్సు ప్రారంభం

కోల్​బెల్ట్, వెలుగు : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సింగరేణి సంస్థ పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వృత్తి కోర్సులపై ఫ్రీ ట్రయినింగ్​ ఇస్తూ ఉపాధి మార్గాలు చూపుతోందని మందమర్రి ఏరియా జీఎం ఎ.మనోహర్​అన్నారు. రీజినల్​ డైరెక్టరేట్​ఆఫ్​ స్కిల్​ డెవలప్​మెంట్​ అండ్ ​ఎంటర్​ప్రెన్యూర్​షిప్ రీజియన్ డైరెక్టర్​ కె.శ్రీనివాస్​రావుతో కలిసి జీఎం సోమవారం

మందమర్రిలోని సింగరేణి స్కిల్ ​డెవలప్​మెంట్​ట్రైనింగ్ ​సెంటర్​లో కొత్తగా గ్యాస్ ​అండ్​ ఆర్క్ వెల్డింగ్​ కోర్సును ప్రారంభించారు. సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సూచనల మేరకు కోల్​బెల్ట్ ​నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూర్చే బాధ్యత సింగరేణి తీసుకుందన్నారు. 

సింగరేణిలో ఉద్యోగం దొరకడం అదృష్టం

మందమర్రి ఏరియా సింగరేణి ఎంవీటీసీ కేంద్రంలో కొత్తగా ఉద్యోగంలో చేరనున్న 40 మంది జూనియర్​అసిస్టెంట్లకు ఇండక్షన్ ​ట్రైనింగ్ ​క్లాస్​లను సోమవారం జీఎం మనోహర్​ ప్రారంభించారు. సింగరేణిలో ఉద్యోగం దక్కించుకోవడం అదృష్టమని ఆయన పేర్కొన్నారు.

కొత్త ఉద్యోగులకు 5 రోజుల పాటు టైనింగ్​ క్లాస్​లు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఏరియా ఎస్​ఓటుజీఎం ఎ.రాజేశ్వర్ ​రెడ్డి, ఎంవీటీసీ మేనేజర్ ​జి.శంకర్, ఐఎస్​డీఎస్​జాయింట్​ డైరెక్టర్ విద్యానంద్, అసిస్టెంట్ డైరెక్టర్ పీకే చందేల్​ ప్రమోద్, ఎంవీటీసీ అసిస్టెంట్​ ట్రైనింగ్​ఆఫీసర్ ​అశోక్ ​తదితరులు పాల్గొన్నారు.