కోల్‌బెల్ట్, వెలుగు: రహదారి భద్రతపై అవగాహన పెంచడం, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న అరైవ్అలైవ్కార్యక్రమంలో భాగంగా అన్ని ఆఫీసులు, పెట్రోల్‌బంకుల్లో ‘నో హెల్మెట్ నో ఎంట్రీ’ని అమలు చేయనున్నట్లు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్‌స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని సీఐ పర్స రమేశ్, టౌన్ఎస్సై గోపతి నరేశ్ప్రారంభించారు.
‘సురక్షిత ప్రయాణం–సుఖమయ జీవితం’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. బైక్నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. మందమర్రి పోలీస్ స్టేషన్, తహసీల్దార్, మున్సిపల్, ఇతర ప్రభుత్వఆఫీసులు, పెట్రోల్‌బంకుల్లో ‘నో హెల్మెట్–నో ఎంట్రీ’ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అంతకుముందు హెల్మెట్ధరించి పోలీసులు పట్టణంలోని ప్రధాన చౌరస్తాల మీదుగా బైక్‌ర్యాలీ
నిర్వహించారు

