
న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ టీమ్ స్టయిలిష్ బ్యాటర్ స్మృతి మంధాన (63 బాల్స్‌లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 125) మరోసారి తన బ్యాట్ పవర్ చూపెట్టింది. 50 బాల్స్‌లోనే వంద కొట్టి వన్డేల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డుకెక్కింది. అయినా ఈ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా అమ్మాయిల టీమ్ సిరీస్ నెగ్గలేకపోయింది. ఇరు జట్ల మధ్య శనివారం పరుగుల మోత మోగిన మూడో, చివరి వన్డేలో ఇండియా 43 రన్స్ తేడాతో పోరాడి ఓడిపోయింది. స్టార్ బ్యాటర్ బెత్ మూనీ (75 బాల్స్‌లో 23 ఫోర్లు, 1 సిక్స్‌తో138) భారీ సెంచరీతో విజృంభించడంతో ఆసీస్ 2–1తో సిరీస్ సొంతం చేసుకుంది.
మూనీకి తోడు జార్జియా వోల్ (81), ఎలీస్ పెర్రీ (68) ఫిఫ్టీలతో సత్తా చాటడంతో తొలుత ఆసీస్ 47.5 ఓవర్లలో 412 రన్స్‌కు ఆలౌటైంది. వన్డేల్లో ఇండియాపై తమ హయ్యెస్ట్ స్కోరును నమోదు చేసింది. గతేడాది బ్రిస్బేన్‌లో సాధించిన 371/8 స్కోరు రికార్డును మెరుగుపరుచుకుంది. అలాగే,1997లో డెన్మార్క్‌పై చేసిన తమ అత్యధిక స్కోరు (412/3) రికార్డును సమం చేసింది. ఇండియా బౌలర్లలో అరుంధతి రెడ్డి మూడు, దీప్తి శర్మ, రేణుకా సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీప్తి పట్టిన సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్ మినహా ఈ పోరులో హర్మన్‌సేన క్యాచింగ్, ఫీల్డింగ్ పేలవంగా ఉండటం ఆసీస్‌కు కలిసొచ్చింది. అనంతరం ఛేజింగ్‌లో ఇండియా 47 ఓవర్లలో 369 రన్స్‌కు ఆలౌటైంది. మంధానకు తోడు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 72), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (35 బాల్స్‌లో 8 ఫోర్లతో 52) రాణించినా ఫలితం లేకపోయింది. ఓపెనర్ ప్రతీకా రావల్ (10), వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (11) ఫెయిలైనా.. మంధాన, హర్మన్ మూడో వికెట్‌కు 121 రన్స్ జోడించారు. ఈ ఇద్దరి జోరుకు 20 ఓవర్లకే స్కోరు 200 దాటడంతో ఇండియా హయ్యెస్ట్ టార్గెట్ ఛేజింగ్‌తో రికార్డు సృష్టించేలా కనిపించింది. కానీ, వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ ఔటైన తర్వాత ఆతిథ్య జట్టు తడబడింది. మధ్యలో దీప్తి, చివర్లో స్నేహ్ రాణా (35) ఆశలు రేపినా.. టార్గెట్ మరీ ఎక్కువ కావడంతో ఇండియా విజయం అందుకోలేకపోయింది. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్ మూడు, మేగన్ షుట్ రెండు వికెట్లు పడగొట్టారు. బెత్ మూనీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఇరు జట్లూ ఈ నెల 30 నుంచి మొదలయ్యే వన్డే వరల్డ్ కప్‌లో బరిలోకి దిగుతాయి.
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇండియా అమ్మాయిలు ఈ మ్యాచ్‌లో పింక్ కలర్ జెర్సీలు వేసుకొని ఆడారు.
- వన్డేల్లో ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా మంధాన తన రికార్డును మెరుగు పరుచుకుంది. ఈ ఏడాదే ఐర్లాండ్‌పై 70 బాల్స్‌లో చేసిన సెంచరీ రికార్డును బ్రేక్ చేసింది.
- విమెన్స్ వన్డేల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ మంధాన. ఆసీస్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ 2012లో న్యూజిలాండ్‌పై 45 బాల్స్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది.
- ఈ ఫార్మాట్‌లో మంధాన కొట్టిన సెంచరీలు. వన్డేల్లో ఎక్కువ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ రికార్డు సమం చేసింది.మెగ్ లానింగ్ 15 సెంచరీలతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
- ఈ ఏడాది నాలుగు వన్డే సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్ మంధాన.
- 781 ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి వచ్చిన రన్స్. ఇండియా–ఆసీస్ వన్డేల్లో అత్యధికం.