వరుణ్‌‌నే అడగండి: పిలిభిత్ టికెట్​పై స్పందించిన మేనక గాంధీ

వరుణ్‌‌నే అడగండి: పిలిభిత్ టికెట్​పై స్పందించిన మేనక గాంధీ

లక్నో: వరుణ్ గాంధీకి ఉత్తరప్రదేశ్‌‌లోని పిలిభిత్‌‌ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంపై ఆయన తల్లి మేనకా గాంధీ తొలిసారి స్పందించారు. ప్రస్తుతం వరుణ్ గాంధీ ఏమి చేయాలనుకుంటున్నారు అని మీడియా ప్రశ్నించగా.. " ఈ విషయం అతడినే అడగండి. లోక్ సభ ఎన్నికల తర్వాత మేం దాని గురించి ఆలోచిస్తం. ఇంకా సమయం ఉంది" అని అన్నారు. యూపీలోని సుల్తాన్ పూర్ టికెట్ ను బీజేపీ తనకు కేటాయించడంపై మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం తొలిసారి సుల్తాన్‌‌పూర్‌‌కు వెళ్లారు. అక్కడున్న శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేనకా గాంధీ మాట్లాడుతూ.. 10 రోజుల్లో సుల్తాన్‌‌పూర్‌‌ లోక్‌‌సభ నియోజక వర్గంలోని మొత్తం 101 గ్రామాలను సందర్శించనున్నట్లు చెప్పారు.