సుప్రీంకోర్టు తన బాధ్యత నుంచి తప్పుకున్నది: మేనకా గాంధీ

సుప్రీంకోర్టు తన బాధ్యత నుంచి తప్పుకున్నది: మేనకా గాంధీ
  • వీధి కుక్కల విషయంలో కోర్టు ఇచ్చిన ఏ ఆదేశం కూడా  దేశవ్యాప్తంగా అమలు కాలే: మేనకా గాంధీ
  • వాటిని అమలు చేయడం టెక్నికల్‌‌‌‌గా సాధ్యం కాదని కామెంట్‌‌‌‌

న్యూఢిల్లీ: వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు తన బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుందని  కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ పేర్కొన్నారు. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా అమలు కాలేదని, అసలు వాటిని అమలు చేయడం టెక్నికల్‌‌‌‌గా సాధ్యం కాదు అని అన్నారు. వీధి కుక్కల తరలింపు, కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) పై 2025 నవంబర్‌‌‌‌లో తాము జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించిన నేపథ్యంలో మేనకా గాంధీ మీడియాతో మాట్లాడారు.

‘‘కోర్టు కొత్తగా ఏమీ చేయలేదు, తన బాధ్యతల నుంచి తప్పుకొని.. మీకు ఏవైనా సమస్యలుంటే హైకోర్టుకు వెళ్లాలని చెప్పింది” అని పేర్కొన్నారు. గడిచిన 6 నెలల్లో తమ ఆదేశాలు ఎందుకు అమలు కాలేదనే విషయాన్ని పరిశీలించకుండా, సుప్రీంకోర్టు కేవలం పాత ఉత్తర్వులనే మళ్లీ చదివి వినిపించిందన్నారు. ‘‘గత నవంబర్‌‌‌‌లో కోర్టు ఏం చెప్పిందో, దాన్నే ఇప్పుడు మళ్లీ చేయాలని చెప్పింది. కానీ నవంబర్ నుంచి ఇప్పటివరకు ఎవరూ ఏమీ చేయలేదు. దేశంలో ఒక్క యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు’’ అని ఆమె మండిపడ్డారు. ఒక్క షెల్టర్ హోమ్ గానీ, హాస్పిటల్ గానీ నిర్మించలేదని, బస్టాపులు, పాఠశాలలు, కళాశాలల నుంచి ఎవరూ కుక్కలను తొలగించలేదని పేర్కొన్నారు.