
మనం ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డరిస్తే.. డెలివరీ బోయ్ ఏ స్కూటీ మీదనో, బైక్ మీదనో తీసుకొచ్చి ఇస్తాడు. కానీ.. అక్కడ మాత్రం కోట్ల విలువ చేసే కారులో తీసుకొచ్చి ఇస్తున్నారట. దుబాయ్ లో మామిడి పండ్లు ఆర్డరిచ్చిన వారికి ఒక సూపర్ మార్కెట్ బంపర్ ఆఫరిచ్చింది. పండ్లను డెలివరీ చేయడానికి లగ్జోరియస్ కార్ లంబోర్ఘినిలో తీసుకురావడమే కాకుండా.. ఆర్డరిచ్చిన వారిని అందులో ఎక్కించుకొని ఒక రైడ్ కూడా చేయిస్తున్నారు. దుబాయ్‌లోని ఒక పాకిస్తాన్ సూపర్ మార్కెట్ ఈ ఆఫర్ ను పెట్టింది. ‘రాజు రాజులాగా ప్రయాణించాలి’ అని ఆ సూపర్ మార్కెట్ స్టోర్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ జెహాన్జేబ్ అంటున్నారు. ఆయనే స్వయంగా పండ్లను డెలివరీ చేసి.. ఆర్డరిచ్చిన వారిని ఒక రైడుకు తీసుకెళ్తాడు. అయితే ఈ ఆఫర్ ను అందుకోవాలంటే.. సూపర్ మార్కెట్ ఫేస్ బుక్ పేజీలో 100 దిర్హమ్ ల విలువ గల పండ్లను ఆర్డర్ చేయవలసి ఉంటుంది.
‘వినియోగదారుల ముఖాల్లో చిరునవ్వును కలిగించడంతో పాటు.. వారికి ప్రత్యేక అనుభూతిని కలిగించడమే మా ఈ ఆలోచన. కరోనావైరస్ వల్ల పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. దాంతో వారికోసం ఈ జాయ్ రైడ్ ను ఏర్పాటు చేశాం. అయితే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మాకొచ్చే ప్రతి ఆర్డర్‌కు ఒక గంట సమయం పడుతుంది. అందువల్ల మేం రోజుకు కేవలం 7 నుంచి 8 డెలివరీలు మాత్రమే చేయగలుగుతున్నాం. మేం మా డెలివరీల సంఖ్యను 12కి పెంచాలని అనుకుంటున్నాం’అని జెహాన్జీబ్ అన్నారు. మామిడిపండ్ల ప్రేమికులు పండ్లను తీసుకొని.. రైడ్ చేసిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఆన్ లైన్ లో పండ్లు ఆర్డరిచ్చి వాటిని అందుకున్న ఓ వ్యక్తి కారులో పండ్లు రావడాన్ని వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.
The #Pakistani supermarket in #Dubai delivered #AnwarRatol and #Chaunsa mangoes to my house in a #Lamborghini pic.twitter.com/d1TkFGeXkN
— Musfir Khawaja (AutoDrift.ae) (@Khawaja_Jeee) June 18, 2020
For More News..