సినిమా అవకాశాల పేరుతో మోసం.. వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

సినిమా అవకాశాల పేరుతో మోసం.. వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

హైదరాబాద్ మణికొండలోని ల్యాంకో హిల్స్ 21 అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన బిందు శ్రీ కేసులో అసలు నిజాలు బయట పడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ.. పూర్ణచంద్రరావు మోసం చేశాడని మనస్తాపంతో బందు శ్రీ ఆత్మహత్య చేసుకుంది. ఏడు సంవత్సరాలుగా పూర్ణచందర్ ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో పూర్ణచందర్ కీ బిందు శ్రీకి మధ్య చనువు ఏర్పడింది. వీళ్ళ అఫైర్ గురించి పూర్ణచందర్ భార్యకు తెలవడంతో.. బందుశ్రీకి పూర్ణచందర్ కు మధ్య గొడవ జరిగింది. అయితే పూర్ణచందర్ వేధింపులు తాళలేక బిందు శ్రీ ఆత్మహత్య చేసుకుంది. పూర్ణచందర్ పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించారు. సినిమా ఇండస్ట్రీకీ పూర్ణచందర్ కు ఎలాంటి సంబంధాలు లేవు. పూర్ణచందర్ హోం థియేటర్ బిజినెస్ చేస్తుంటాడు.

ఏం జరిగిందంటే...

హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మణికొండ ల్యాంకో  హిల్స్ లో ఆగస్టు 11 శుక్రవారం అర్థరాత్రి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బిందు శ్రీ అనే యువతి 21వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన బిందుశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. ల్యాంకో హిల్స్ 15 LH బ్లాక్ లోని పూర్ణ చందర్ రావు ఇంట్లో బిందుశ్రీ చిల్డ్రన్ కేర్ టేకర్ గా పనిచేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.