దాడికి వంద రెట్లు ప్రతిదాడులు చేస్తం .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్

దాడికి వంద రెట్లు ప్రతిదాడులు చేస్తం .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్
  • పాక్ తోక జాడిస్తే కత్తిరించేస్తాం

హైదరాబాద్, వెలుగు: ఉగ్రదాడులపై దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోతే క్యాండిల్స్​ వెలిగించి నివాళులర్పించే విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్తాన్  ఒక్క దాడి చేస్తే, వందరెట్లు ప్రతిదాడి చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పాక్ కు నిరూపించామని తెలిపారు. ఆదివారం ప్రధాని మోదీ మన్  కీ బాత్  కార్యక్రమాన్ని  హైదరాబాద్ లోని సనత్​నగర్ లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కిషన్  రెడ్డి చూశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. లుంబినీ పార్క్,  గోకుల్ చాట్, దిల్​సుఖ్ నగర్​ పేలుళ్లు, ముంబైలో దాడులు, పార్లమెంట్ పై దాడి ఇలా అనేక దాడులతో 46 ఏళ్లుగా పాకిస్తాన్ ​ఉగ్రవాదాన్ని భారత్​ పై ఎగదోస్తూ అనేక మంది ప్రాణాలను బలితీసుకుందనారు. గతంలో ఈ దాడుల సమయంలో నివాళులర్పించి సరిపెట్టుకునేవారమని, బీజేపీ   ప్రభుత్వం వచ్చాక ఉరీ టెర్రర్  అటాక్స్ కు ప్రతీకారంగా సర్జికల్​ స్ట్రయిక్స్, పుల్వామా దాడికి ఎయిర్ స్ట్రయిక్స్  చేశామని చెప్పారు.  పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్  సిందూర్  నిర్వహించి వందల మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామన్నారు. టెర్రరిజంపై పాక్​ కుక్క తోక వంకర అన్నట్లే ప్రవర్తిస్తే ఆ తోకను కత్తిరించేస్తామని హెచ్చరించారు.