
దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కరోనాతో పలువురు మృతి చెందగా... తాజాగా మహారాష్ట్రలోని థానేలో మరో కరోనా మరణం నమోదయ్యింది. థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో కరోనాతో 21 ఏళ్ళ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు అధికారులు. మృతుడు కామోర్మోడిటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మృతుడు డయాబెటిస్ సంబంధిత సమస్యలతో గురువారం ( మే 22 ) ఆసుపత్రిలో చేరారని, శుక్రవారం ( మే 23 ) రాత్రి ఆయనకు కోవిడ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
ఆదివారం ( మే 25 ) నాటికి థానేలో 8 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని.. మొత్తం 18 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు అధికారులు. అయితే.. కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదని.. వైరస్ లక్షణాలు కనిపించినవారు సకాలంలో పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.పరిస్థితి అదుపులో ఉందని.. ప్రజలు భయపడవద్దని తెలిపింది థానే మున్సిపల్ కార్పొరేషన్.
ALSO READ | విజృంభిస్తున్న కరోనా.. కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరు మృతి
ఇదిలా ఉండగా.. కర్ణాటకలో కూడా కరోనా కేసులో మృతి చెందడం కలకలం రేపింది. బెంగళూరులోని ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 84 ఏళ్ల వృద్ధుడు శరీరంలోని అవయవాలు ఫెయిల్ అయ్యి చనిపోయాడు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నిర్వహించిన పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు అధికారులు. శనివారం రిపోర్టు రావడంతో చికిత్స మొదలు పెట్టారు. కానీ .. ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో చనిపోయాడు.
కర్ణాటక ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. కర్ణాటకలో 38 కేసులు నమోదవ్వగా... అందులో బెంగళూరులోనే 32 పాజిటివ్ కేసులు నమోదు కావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.