
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం యాభై శాతంకు పైగా షూటింగ్ జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌తో బిజీగా ఉండటంతో కొన్నాళ్లు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు. రీసెంట్‌గా ఆయన కమిట్ అయిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.
ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ పూర్తి చేయగా, జూన్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ‘ఓజీ’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు పవన్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆదివారం ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘ఫైరింగ్ వరల్డ్‌వైడ్’ అంటూ సెప్టెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దసరా సెలవులు ఈ మూవీకి మరింత ప్లస్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. మరోవైపు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ సెట్స్‌లోనూ వచ్చే నెలలో పవన్ జాయిన్ కానున్నారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాది ఎండింగ్‌లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ ఏడాదే పవన్ నుంచి మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.