మాకు శాంతి కావాలి.. చర్యలు చేపట్టండి: అమిత్షాకు మణిపూర్ ఎంపీ లేఖ

మాకు శాంతి కావాలి.. చర్యలు చేపట్టండి: అమిత్షాకు మణిపూర్ ఎంపీ లేఖ

మణిపూర్ లో మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే.. గత కొంత కాలంగా కుకీలు, మైథీల మధ్య జరుగుతున్న అల్లర్ల కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పో యారు. మణిపూర్ లో నెలకొన్న హింసాత్మక సంక్షోభాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి నేతలు కేంద్రాన్ని కోరారు. 

‘‘మాకు శాంతి కావాలి.. తక్షణ మే దిద్దుబాటు చర్యలు చేపట్టండి’’ అంటూ మణిపూర్ ఎంపీ అకోయిజం హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మణిపూర్ లో ప్రస్తుత సంక్షోభం.. అక్రమ వలదా రులు, విదేశీ అంశాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరారు.  

గత కొంత కాలంగా కొనసాగుతున్న హింస కారణంగా  వందల సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారు. 60వేల మంది నిరాశ్రయులయ్యారు. సహాయక శిబిరాల్లో దయనీయ స్థితిలో మగ్గుతున్నారు. మణిపూర్ లో హింస ఇప్పటికీ కొనసాగుతుంది. కేంద్రం జోక్యం చేసుకొని మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలని  మణిపూర్ ఎంపీ అకోయిజం లేఖలో తెలిపారు. 


గత రెండు రోజులుగా కొనసాగుతున్న హింసతో మరింత ప్రాణనష్టం , ఆస్థినష్టం జరిగిందన్నారు. వైమానిక దాడులు, డ్రోన్ లు, రాకెట్ దాడులు జరిగిందని ఫలితంగా ప్రాణనష్టం, ఆస్థినష్టం తో హింస ప్రమాదకరంగా మారిందన్నారు. వీటితోపాటు దోపిడీలు జరుగుతున్నాయన్నారు. మణిపూర్ సంక్షోభంతో తీవ్ర ఆవేదన చెందుతున్నాం.. మీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కూడా ఇలాంటి జరిగితే ఎలా స్పందిస్తారో.. అలాగే మణిపూర్ సంక్షోభంపై కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాని ఎంపీ అకోయిజం లేఖలో తెలిపారు.