పోలింగ్‌ సిబ్బంది అంతా ఆడవారే !

పోలింగ్‌ సిబ్బంది అంతా ఆడవారే !
  •  మణిపూర్ లోని ఓ నియోజకవర్గం పరిధిలో ప్రయోగం

మణిపూర్‌: దేశంలో అక్కడక్కడ విమెన్‌ పోలింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటు చేస్తోంది  ఈసీ. పూర్తిగా మహిళలతో నిర్వహిం చే ఈ పోలింగ్‌ కేంద్రాలను ‘సఖి’ పేరుతో నిర్వహిస్తోంది. ఇందులో పోలింగ్‌ సిబ్బందితోపాటు ఓటేసే వాళ్లూ మహిళలే. వీటినే ‘పింక్‌’ పోలింగ్‌  కేం ద్రాలనీ అంటారు. మహిళా ఓటర్లు అధికంగాఉన్న చోట ఒకటీ రెండూ ఇలా ఏర్పాటు చేయడం మామూలే. కానీ ఇన్నర్‌ మణిపూర్‌ లోక్ సభ స్థానం పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్ లల్లో పనిచేసే సిబ్బంది మొత్తం మహిళలే.

ఇన్నర్‌ మణిపూర్‌ లోక్ సభ పరిధిలో 1300 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నా రు. అందులో 76 పోలింగ్‌ బూత్ లల్లో సిబ్బం ది మొత్తం మహిళలే ఉన్నారు. వాటిలో 38 పోలింగ్‌ స్టేషన్లు యష్కూల్‌ అసెంబ్లీ పరిధి మొత్తాన్ని కవర్‌ చేశాయి. గతంలోఎప్పుడూ ఇలా నియోజకవర్గం మొత్తం విమెన్‌ సిబ్బందితో పోలింగ్‌ బూత్ లను ఏర్పాటు చేసిన దాఖలాలులేవు. ఇక్కడ పోలింగ్‌ పూర్తయితే ఒక రికార్డు నమోదు కానుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇది ఒక్క మణిపూర్ లోనే చేయడం లేదని, మరికొన్ని ప్రాంతాల్లోనూ కేవలం మహిళలతో బూత్ లు ఏర్పాటుచేయబోతున్నా మని తెలిపారు. మణిపూర్‌ మొత్తంజనాభా 28 లక్షలు. ఇందులో 19,59,429 మందిఓటర్లు ఉన్నారు. గురువారం నిర్వహించే సెకండ్‌ ఫేజ్‌ ఎన్నికల్లో ఇన్నర్‌ మణిపూర్‌ స్థానం పరిధిలోని 9,27,626 మంది ఓటేయనున్నా రు. ‘మణిపూర్‌ అంటేనే మహిళా శక్తి గుర్తొస్తుంది. అనేక సామాజిక అంశాలపై ఇక్కడి మహిళలు పోరాటం చేశారు. మరోమారు మహిళా శక్తి చూపడం కోసమే ఈ ప్లాన్‌ చేశాం , అని మణిపూర్‌ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ పీకేసింగ్‌ తెలిపారు.

కాంచీపురంలోనూ…కాంచీపురం (తమిళనాడు): కాం చీపురం లోక్ సభపరిధిలో మహిళా ఓటర్లకు అధికారులు ప్రత్యేకఏర్పాట్లు చేశారు. గురువారం జరగనున్న లోక్ సభఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళల కోసం 22స్పె షల్‌ ఓటింగ్‌, 44 మోడల్‌  ఓటింగ్‌ సెంటర్లనుఏర్పాటుచేసినట్టు అధికారులు చెప్పారు.