మణిపురి సంస్కృతిలో ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు బూట్లు తొలగించడం సంప్రదాయమని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ గురువారం అన్నారు. మణిపురి ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసేందుకు వెళ్తే.. ఇంట్లోకి ప్రవేశించే ముందు బూట్లు తొలగించాలని కోరడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సింగ్ స్పందించారు. దీనిపై బీరేన్ సింగ్ ఇలా ట్వీట్ చేశారు."ఎవరి ఇంట్లోకి ప్రవేశించినా మన బూట్లు తీసివేయడం మణిపురి సంస్కృతిలో పాత సంప్రదాయం. దానిని అవమానించేలా కొంతమంది పెంపుడు కుక్కలు అవాస్తవాల్ని వ్యాపింప చేస్తున్నారు. మణిపూర్ గురించి మాట్లాడే ముందు రాహుల్ గాంధీ... దయచేసి మణిపురి సంస్కృతిని తెలుసుకోవాలి" అంటూ సీఎం ట్వీట్ చేశారు.
మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో బీజేపీ గెలుపు కోసం అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చారు. దీంట్లో భాగంగా కీలక నేత అమిత్ షా మణిపూర్ లో మకాం వేశారు. ఈక్రమంలో మణిపూర్ కు చెందిన బీజేపీ నేతలు కొంతమంది ఆయనను కలవటానికి వెళ్లారు. ఈసందర్భంగా అమిత్ షాను కలివాలంటే నేతల వారి బూట్లు విప్పి రావాలనే నిబంధన పెట్టారట. దీంతో షాను కలవటానికి వెళ్లిన నేతలు బూట్లు విప్పి లోపలికి వెళ్లారట. దీనిపై కాంగ్రెస్ నేతల రాహుల్ గాంధీ మండిపడ్డారు. బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ ఢిల్లీలో మణిపురి ప్రతినిధి బృందాన్ని హోంమంత్రి అవమానించారని పేర్కొన్నారు. అమిత్ షా చెప్పులు వేసుకోవచ్చుగానీ..ఆయన్ని కలవటానికి వెళ్లే నేతలు మాత్రం బూట్లు విప్పాలా? అంటూ ప్రశ్నించారు రాహుల్.
ఇవి కూడా చదవండి:
