మేడారం జాతరలో బెల్లం బంగారం ఎలా అయ్యింది?

మేడారం జాతరలో బెల్లం బంగారం ఎలా అయ్యింది?

మేడారం జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. సమ్మక-సారలమ్మ జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది . కుంభ మేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తల పిస్తుంది. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలా ది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు.

మామూలుగా మనలో చాలా మంది దేవుళ్లందరికీ అనేక రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటాయి. అయితే అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీల ఆచారాలు మాత్రం మనందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఈ జాతరలో సమ్మక్క, సారలక్కకు భక్తులందరూ బెల్లాన్ని బంగారంగా భావించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆదివాసీలకు బెల్లం, ఉప్పు అంటే ఇష్టం. ఎందుకంటే ఇవి ఇతర ప్రాంతాల నుండి వారి దగ్గరికి వస్తాయి. అందుకే వారు వీటికి ఎక్కువ విలువ ఇస్తారు. ముఖ్యంగా చాలా మంది మహిళలు తమకు సంతానం కలిగినా.. సంతానం కలగాలన్నా.. తమ బరువును అంతా ఈ బెల్లంగా రూపంలో చెల్లించుకునేందుకు ఈ జాతరకు వస్తారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు తమ కోరికలను నెరవేరుతాయని కొందరు.. మరి కొందరు తమ కోరికలు నెరవేరినందుకు ఈ మొక్కులను తీరుస్తారు.

ఇక్కడి అమ్మవార్లకు తమ పిల్లల బరువును బట్టి బెల్లాన్ని సమర్పిస్తున్నారంట. ముఖ్యంగా తమ పిల్లలకు ఉద్యోగం వస్తే లేదా తమ పిల్లలకు మంచి కాలేజీలో సీటు వచ్చినా.. విదేశాలలో ఉన్నత చదువులకు సంబంధించి అవకాశం వచ్చినప్పుడు ఆ పిల్లల ఎత్తు.. బరువు ఉన్న బెల్లాన్ని సమర్పిస్తారమని భక్తులే స్వయంగా చెబుతున్నారు. ఆదివాసీలందరూ ఒకప్పుడు బెల్లం చాలా ఖరీదైన వస్తువుగా భావించేవారు. దీన్నే దేవతలకు సమర్పించేవారు. అయితే దీనికి సంబంధించి మరో కథను కూడా అక్కడి స్థానికులు చెబుతున్నారు. సమ్మక్క భర్త పేరు పగిడిద్ధ రాజు. అతని పేరులో పగిడి అంటే బంగారం అనే అర్థం ఉందని వారి నమ్మకమట. అందుకే ఇక్కడ బెల్లానికి బంగారం అని పేరు వచ్చిందని చాలా మంది చెబుతుంటారు. 

ఇవి కూడా చదవండి: