ప్రజల్లో ఉండే నాయకుడినే గెలిపించండి : డిప్యూటీ సీఎం భట్టి

ప్రజల్లో ఉండే నాయకుడినే గెలిపించండి : డిప్యూటీ సీఎం భట్టి
  • జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో నవీన్​యాదవ్‌‌‌‌కు భారీ మెజార్టీ ఇవ్వండి: డిప్యూటీ సీఎం భట్టి

జూబ్లీహిల్స్, వెలుగు: ప్రజాసేవ చేసేందుకు  ముందుకొస్తున్న నవీన్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే అనేక సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం జూబ్లీహిల్స్​సెగ్మెంట్‌‌‌‌లోని యూసఫ్‌‌‌‌గూడ, కృష్ణానగర్ ​ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌తో కలిసి భట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రజా పాలనలో ఇంటింటా సంక్షేమం అందుతున్నదని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ను ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు.

  ఎవరికైతే సంక్షేమ పథకాలు అందడం లేదో వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  యూసఫ్‌‌‌‌గూడలో అభివృద్ధి స్థానిక నాయకుడు నవీన్ యాదవ్‌‌‌‌తోనే సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఈ ప్రాంత యువకుడిగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నవీన్ యాదవ్‌‌‌‌కు తెలుసు కాబట్టి వాటిని శాశ్వతంగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.  వారి వెంట  ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.