
సంగారెడ్డి టౌన్, వెలుగు: మంజీరా డ్యామ్ డేంజర్ జోన్లో లేదని, చాలా సేఫ్‌గా ఉందని నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంజీరా బ్యారేజ్ కి పగుళ్లు వచ్చాయన్నది నిజం కాదన్నారు.
బ్యారేజ్ ఆప్రాన్ కొట్టుకుపోయిన మాట వాస్తవమేనని చెప్పారు. బ్యారేజీ రిపేర్లకు రూ.3.50 కోట్లు కేటాయించామని, వెంటనే మంజీరా కట్ట మరమ్మతులు చేస్తామన్నారు. జంటనగరాలకు తాగునీరందించే ఈ బ్యారేజీ హెచ్ఎండీఏ పరిధిలో ఉందన్నారు. జూరాల గేట్స్ రోప్స్ ఫెయిల్ అయ్యాయని, అక్కడ పనులు చేస్తున్నామని పేర్కొన్నారు.