A సర్టిఫికెట్ చూపిస్తానంటున్న రకుల్ ప్రీత్ సింగ్

A సర్టిఫికెట్ చూపిస్తానంటున్న రకుల్ ప్రీత్ సింగ్

ఇప్పటి దాకా U సర్టిఫికెట్ కోసం ప్రయత్నించా కుదరలేదు.. ఇక ఏ సర్టిఫికెట్ చూపిస్తా అంటూ రెచ్చిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. నాగార్జున, రకుల్ జంటగా మన్మధుడు2 తెరకెక్కుతుంది. అయితే రకుల్ పోషించిన పాత్ర అవంతికను పరిచయం చేస్తూ టీజర్ ను రిలీజ్ చేశారు మూవీటీం.

ఆ అమ్మాయి చల్లని గాలి లాంటిది సార్ అంటూ అవంతిక క్యారెక్టర్ గురించి చెప్తున్న వెన్నెల కిషోర్ ను…. బ్లూ..బ్లూ..బ్లూ బొంగేం కాదు అని వెక్కిరిస్తాడు నాగార్జున. నాగ్ అన్నట్టుగానే అవంతిక క్యారెక్టర్ మామూలుగా.. ఉండదు… నేను రెండు సవంత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన నాగ్ ను.. ఈ వయసులో లవ్ ఫేల్యూర్ తట్టుకోలేవంటూ వెక్కిరిస్తది అవంతిక… అంతటితో ఆగకుండా… ఇకపై A సర్టిఫికేట్ చూపిస్తానంటూ రెచ్చిపోతది… మొత్తానికైతే మన్మధుడు2 ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకాన్ని కలిగించారు దర్శకుడు రవీంద్రన్. ఈ సినిమాను వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌లపై నాగార్జున నిర్మిస్తున్నారు.