
- రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలగాయన్న ఎమ్యెల్యే
పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు నిర్మించబోయే ఫోర్ లైన్ నేషనల్ హైవే నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం మన్నెగూడలో మీడియాతో ఆయన మాట్లాడారు. మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్‌వరకు మొత్తం 950 చెట్లు ఉన్నాయని, వీటిలో 150 మర్రి చెట్లను వేర్లతో సహా తొలగించి వేరే ప్రదేశాల్లో నాటుతామన్నారు. మిగితా 800 చెట్లు రోడ్డు విస్తరణలో మధ్య భాగంలో వస్తాయని చెప్పారు. పర్యావరణవేత్తలు గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లడంతో చెట్లకు హాని కలగకుండా వాటిని పక్కకు నాటి రోడ్డు విస్తరణ పనులు
చేపట్టనున్నట్లు వివరించారు.