David Reddy: క్రూరమైన రెబెల్‌గా మంచు మనోజ్: ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ విధ్వంసం

David Reddy: క్రూరమైన రెబెల్‌గా మంచు మనోజ్: ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ విధ్వంసం

వర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ‘భైరవం’, ‘మిరాయ్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించి మంచి విజయాలు అందుకున్నారు. ఈ సినిమాల సక్సెస్ జోష్‌ను కొనసాగిస్తూ, మనోజ్ తనదైన పంథాలో విభిన్న కథలతో ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలోనే మనోజ్ నుంచి మరో ఆసక్తికర చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్, లేటెస్ట్గా మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో మనోజ్ మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత క్రూరమైన అవతారంలో కనిపిస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.

పోస్టర్ విడుదల సందర్భంగా మనోజ్ పెట్టిన క్యాప్షన్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. “నాలో ఒక సరికొత్త కోణం. క్రూరమైనది. నిర్దాక్షిణ్యమైనది. పశ్చాత్తాపం లేనిది” అంటూ ఆయన తెలిపిన మాటలు, ఈ సినిమాలోని పాత్ర తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ఈ చిత్రానికి కొత్త దర్శకుడు హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోత్కూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘డేవిడ్ రెడ్డి’ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ కథ 1897 నుంచి 1922 మధ్య బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంతో సాగనుందని తెలుస్తోంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగి, బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన ఒక రెబెల్ వ్యక్తి కథగా ఈ సినిమా ఉండనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే విడుదల కానున్నాయి.

ప్రస్తుతం మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’, ‘వాట్ ద ఫిష్’ చిత్రాలతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతేకాకుండా మరో రెండు సినిమాలను కూడా హీరోగా లైన్‌లో పెట్టినట్లు సమాచారం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manoj Manchu (@manojkmanchu)